TG: కేంద్ర జల్‌శక్తి మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. NDSA ఛైర్మన్ అనిల్ జైన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించారు. రేవంత్‌తో కలిసి అనిల్ జైన్ ఎలా పాల్గొంటారు? భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లితే, కాంగ్రెస్ ఆ నిందను NDSAపై మోపే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు.