AP: సింగపూర్లో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారంపాటు మంత్రులు శిక్షణ పొందనున్నారు. ఇవాళ సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రజల రక్షణకు చర్యలు, చట్టాలపై మంత్రులకు వివరించారు. కాగా, ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి ఉన్నారు.