AP: వివిధ పథకాల కింద మినీ, మీడియం సైలేజి(పాతరగడ్డి) బేళ్ల తయారీ పరికరాలను 50 శాతం రాయితీపై లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వనుంది. హార్వెస్టర్, లోడర్, బేల్ వ్రాపర్ పరికరాలు కూడా రాయితీపై అందించనుంది. వాటికోసం ఏపీ ఆగ్రోస్ ద్వారా టెండర్లు పిలవాలని, మొత్తం విలువలో 2 శాతం చొప్పున సేవా రుసుముల కింద ఆ సంస్థకు ఇవ్వాలని ఆదేశిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.