భారత్లో ప్రముఖ పరిశోధన సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) పారిశ్రామిక ఆవిష్కరణలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇక నుంచి దేశంలో సొంతంగా పారాసెటమాల్ ఔషధం తయారు చేయనుంది. వచ్చే సంవత్సరం నాటికి ఈ ఔషధం మార్కెట్లోకి రానుంది. ఈ విషయాన్ని CSIR డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి స్వయంగా వెల్లడించారు. దీంతో పారాసెటమాల్ తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.