TG: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.