TG: సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లు ఇవాళ ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని, లేకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లేనని ట్రాన్స్కో ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నిత్యావసర సేవల నిర్వహణ చట్టం(టెస్మా) కింద కరంట్ సరఫరా నిత్యావసరాల కిందకు వస్తుందని, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. ఈ సమ్మె అక్రమమని, ఆర్టిజన్లు విధుల్లో చేరాలని సూచించింది.