AP: స్క్రబ్ టైఫస్పై అధ్యయనంతోపాటు భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఆరోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష సందర్భంగా సమస్య తీవ్రత, బాధితులకు అందుతున్న వైద్యసాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్క్రబ్ టైఫస్ నివారణ చర్యలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.