AP: రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 15 డీఎస్సీల్లో 14 టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో సుమారు 2 లక్షల మంది టీచర్లను నియమించామని తెలిపారు. నియామక ప్రక్రియపై 150 రోజుల్లో 150 కేసులు వచ్చినా, వాటన్నింటినీ అధిగమించి నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నామని లోకేష్ పేర్కొన్నారు.