జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే సిజేరియన్ డెలివరీ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ధనవంతుల్లోనే ఈ సిజేరియన్ రేట్లు రెండింతలు ఉన్నట్లు తెలిపింది. సహజ ప్రసవాల భయం, ఓ నిర్దిష్ట తేదీనే బిడ్డను కనాలనే కోరిక కారణంగానే ఈ సిజేరియన్ డెలివరీలు పెరుగుతున్నట్లు పేర్కొంది. 60.7 శాతంతో తొలిస్థానంలో తెలంగాణ, తమిళనాడు 44.9 శాతం, ఏపీ 42.4శాతం, కేరళ 39.4శాతం, కర్ణాటక 31.5శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.