AP: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘గతంలో ఆడపిల్లలు బయటకు రాకూడదనేవారు. ఇప్పుడు అమ్మాయిలు కంపెనీలకు CEOలు అవుతున్నారు. సోషల్ మీడియా కుటుంబం నుంచి వ్యక్తులను వేరు చేస్తోంది. యువతను డ్రగ్స్ నాశనం చేస్తున్నాయి. అలాంటి వాటికి యువత దూరంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.