W.G: భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తణుకు మండల తహసీల్దార్ అశోక్ వర్మ పేర్కొన్నారు. గురువారం తణుకు పట్టణంలోని వేమవరం యానాదుల కాలనీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నుంచి అర్జీలను స్వీకరించారు.