SKLM: భారత రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ని కించపరుస్తూ హేళన చేస్తూ పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని టెక్కలి ఆది ఆంధ్ర కులస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్కలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.