NLR: ముంబై జాతీయ రహదారి డివైడర్ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. వ్యాపారస్తులు, రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామని తెలిపారు. పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.