SRD: రోడ్డుపై చేరిన మురుగు నీరుతో కాలనీ వాసులు ఇబ్బందులు గురవుతున్నారు. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ఆలేటి వీర రెడ్డి కాలనీలో రోడ్డు పై మురుగు నీరు ప్రవహించడంతో స్థానిక కాలనీ వాసులు ప్రయాణం కొనసాగించడానికి అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రవహించిన మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతుందని కాలనీ వాసులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.