నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాణ సంస్థ SLV సినిమాస్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి అని తెలిపింది. భవిష్యత్లో ఈ మూవీ అప్డేట్స్, ప్రకటనలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.