TG: జానపద కళాకారుడు, బలగం ఫేమ్ పస్తం మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం తెలిపారు. ‘బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు. జానపద కళకే గొప్ప బలగంగా మొగిలయ్య నిలిచారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన బలగం సినిమాలోని మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి’ అని పేర్కొన్నారు.