ప్రకాశం: గ్రామాలలో ఉన్న భూసమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తాహసీల్దార్ సింగారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పంగులూరు మండలంలో ఆయన ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. భూములకు సంబంధించి ఆన్లైన్ సమస్యలు, పేరు మార్పులు, ఇతరత్రా భూ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని తహసీల్దార్ అన్నారు.