ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాత ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ ఆఫీసును మార్చి 28లోగా ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 48 ఏళ్ల పాటు ఈ బంగ్లానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండొద్దని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.