TG: యువతే మన దేశానికి అతిపెద్ద ఆస్తి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యువ భారత్ రన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. ‘హెల్తీ ఇండియా, ఫిట్ ఇండియా’ దిశగా ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ను కాపాడుకోవాలని, శారీరక దృఢత్వంతోనే దేశ నిర్మాణం సాధ్యమని పిలుపునిచ్చారు.