AP: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. వైద్య శాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారు. అలాగే, ఇకనుంచి 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై 4 వేలు ఇవ్వనున్నారు.