NLR: యూరియాను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి జహీర్ హెచ్చరించారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలోని ఎరువుల దుకాణాలను ఆయన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రైవేటు ఎరువుల దుకాణాదారులతో ఆయన సమావేశం నిర్వహించారు.