చర్మ సౌందర్యానికి చెరకు రసం అద్భుతంగా పనిచేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ముల్తానీ మట్టి కలిపి రాస్తే ముఖంపై ఉన్న నల్లమచ్చలు సులభంగా తొలగిపోతాయి. కొద్దిగా తేనె కలిపి మసాజ్ చేస్తే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే, కాఫీ పొడితో కలిపి స్క్రబ్ చేస్తే ముఖం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది. ఈ సహజ చిట్కాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.