TG: సిద్ధిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన చిక్కుల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఉత్తమ్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు.