TG: వినాయక నిమజ్జనం పోలీసులకు ఛాలెంజింగ్ అని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ అన్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ చాలా కీలకమన్నారు. ‘రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పేర్కొన్నారు.