AP: డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ స్పందించారు. తనపై నమోదైన డ్రగ్స్ కేసు ఇంకా దర్యాప్తులో ఉందన్నారు. ఆ పార్టీలో ఉన్నవారందరినీ అదే తొలిసారి కలిసినట్లు తెలిపారు. త్వరలో క్లీన్ చిట్తో కేసు నుంచి బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.