AP: కృష్ణా జిల్లా ఎస్పీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోను పోస్టు చేశారని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నారని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలకు చెక్ పెట్టాలని కోరారు.