ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ మరో సరికొత్త బైక్ను మార్కెట్లో ఆవిష్కరించనుంది. న్యూ పల్సర్ ఎన్125 పేరిట ఈ బైక్ను తీసుకురానుంది. బజాజ్ ఎన్150 నుంచి వీల్స్, బజాజ్ ఫ్రీడం 125 నుంచి డిస్ప్లే, ఇండికేటర్, ఇన్బిల్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్తో వస్తోంది. దీని ధర రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.