TG: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ‘ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే అవమానించడం సిగ్గుచేటు. పోలీసుల పట్ల మీ కపట ప్రేమకు ఇది మరో నిదర్శనం. ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి కానీ, ఇలా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ నిర్బంధాల పాలన చేయడం దుర్మార్గం’ అని ట్వీట్ చేశారు.