అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ దేశం నుంచి ముప్పు పొంచి ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. దీంతో అమెరికాలో గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.