Siddaramaiah Biography:జనతాదళ్ టు కాంగ్రెస్, సెకండ్ టైమ్ సీఎంగా ఛాన్స్, నేపథ్యం ఇదే
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. జనతాదళ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.
Siddaramaiah:కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను (Siddaramaiah) కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనుభవానికే పెద్దపీట వేసింది. డీకే శివకుమార్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ అతనిని కూల్ చేసి.. సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవీ అప్పగించింది. సిద్ధరామయ్య నేపథ్యం ఏంటీ..? ట్రబుల్ షూటర్‌ను కాదని సిద్దు వైపే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మొగ్గుచూపింది. సిద్ధరామయ్య పొలిటికల్ లైఫ్ ఎలా మొదలైంది..? సింహావలోకనం చేద్దాం పదండి.
అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తీర్పు ఇచ్చారు కానీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. చివరికీ సిద్దరామయ్యను (Siddaramaiah) కర్ణాటక 24వ సీఎంగా ప్రకటించేసింది. సిద్ధరామయ్య ప్రొఫైల్ ఏంటీ..? ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే చర్చ జరుగుతుంది. మైసూర్ సమీపంలో గల సిద్దరామనహుండిలో 1948 ఆగస్ట్ 12వ తేదీన సిద్దరామే గౌడ, బోరమ్మ దంపతులకు సిద్దరామయ్య (Siddaramaiah) జన్మించారు. కురుబ (ఓబీసీ) కులానికి చెందినవారు కాగా.. అతని పేరంట్స్ చదువుకోలేదు. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేసి.. తర్వాత ఎల్ఎల్బీ చేశారు. మైసూర్లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. లా కాలేజీలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
పార్వతిని (parwathi) పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాకేశ్ (38).. (Rakesh) సిద్ధరామయ్య రాజకీయ వారసుడిగా కొనసాగుతారని అంతా భావించారు. మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్‌తో 2016లో చనిపోయాడు. ఆ సమయంలో సిద్ధరామయ్య చాలా కుంగిపోయాడు. మరో కుమారుడు యతీంద్ర.. (yatindra) 2018లో తన తండ్రి నియోజకవర్గం వరుణ నుంచి పోటీ చేసి గెలుపొందారు. పెద్ద కుమారుడి మరణంతో సిద్దరామయ్య నాస్తికుడిగా మారారు. దేవుళ్లను అంతగా విశ్వసించరు. అంతకుముందు మాత్రం ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.
సిద్ధరామయ్య లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రైతు నేత నంజుండ స్వామి శిష్యుడిగా మారిపోయారు. స్వామి స్పూర్తితో 1978లో తాలుకా బోర్డు సభ్యుడిగా సిద్దరామయ్య (Siddaramaiah) ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1983లో చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలా జనతా పార్టీలో చేరారు. అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే మాతృబాష పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘కన్నడ కవాలు సమితి’ తొలి అధ్యక్షుడిగా సిద్దరామయ్య (Siddaramaiah)పనిచేశారు. 1985 ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రిగా అవకాశం లభించింది. 1989 ఎన్నికల్లో మాత్కం ఓటమి చవిచూశారు.
ಕನ್ನಡಿಗರ ಹಿತ ರಕ್ಷಣೆಗೆ ನಮ್ಮ ಕೈಗಳು ಸದಾ ಒಂದಾಗಿರಲಿದೆ.
ಜನಪರ, ಪಾರದರ್ಶಕ, ಭ್ರಷ್ಟಾಚಾರ ರಹಿತ ಆಡಳಿತ ನೀಡುವ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಎಲ್ಲಾ ಗ್ಯಾರೆಂಟಿಗಳನ್ನು ಈಡೇರಿಸಲು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಒಂದು ಕುಟುಂಬವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಲಿದೆ. pic.twitter.com/V0OoO7JUKQ
1992లో జనతాదళ్ ప్రధాన కార్యదర్శిగా సిద్దరామయ్య (Siddaramaiah) ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో విజయం సాధించి.. మరోసారి మంత్రి పదవీ చేపట్టారు. దేవెగౌడ సీఎం కాగా.. సిద్ధరామయ్య ఆర్థికమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఏర్పడిన సంకీర్ణ కూటమి తరఫున దేవేగౌడకు ప్రధాని పదవీ రావడంతో.. 1996లో జేహెచ్ పటేల్ సీఎం పదవీ చేపట్టారు. సిద్ధ రామయ్య (Siddaramaiah)డిప్యూటీ సీఎం పదవీ చేపట్టారు. తర్వాత జనతాదళ్ జేడీఎస్, జేడీయూగా చీలిపోయాయి. దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లో సిద్దరామయ్య చేరి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవీ చేపట్టారు. 1999 ఎన్నికల్లో మరోసారి ఓడిపోయారు. 2004లో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ష ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2006లో పార్టీ నుంచి సిద్ధరామయ్యను (Siddaramaiah) దేవెగౌడ సస్పెండ్ చేయగా.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 9 సార్లు అసెంబ్లీకి ఎన్నిక కాగా.. రెండు సార్లు పరాజయం పాలయ్యారు.
ఇప్పటివరకు 13 సార్లు సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అతనిపై అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయనకు ప్లస్ అయ్యింది. 2013 నుంచి 2018 వరకు ఐదేళ్లు సీఎం పదవీ చేపట్టినా.. మచ్చ లేని నేత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పుడు మంత్రి పదవీ చేపట్టిన డీకే శివకుమార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పారు. అన్నీ అంశాలు చూసి కాంగ్రెస్ హై కమాండ్ సీఎం పదవీని అప్పగించింది.