Amazon Web Service Invest Lakh Crore In Cloud Infrastructure In India
Amazon Web Service:భారత్‌లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెడతామని అమెజాన్ (Amazon) ప్రకటించింది. 2030 నాటికి రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపింది. దేశంలో క్లౌడ్ సేవలకు వస్తోన్న ఆదరణకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
ఈ పెట్టుబడులతో 1.31 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అమెజాన్ వెబ్ సర్వీస్డ (Amazon Web Service) చెబుతోంది. నిర్మాణాలు, నిర్వహణ, టెలీ కమ్యూనికేషన్స్ సహా మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. 2016 నుంచి 2022 వరకు దేశంలో అమెజాన్ (Amazon) రూ.30, 900 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. కొత్త పెట్టుబడులతో కలిపి ఆ మొత్తం రూ.1.36 లక్షల కోట్లకు చేరుతుంది. దీంతో దేశ స్థూల దేశీయ ఉత్పత్తికి రూ.194 లక్షల కోట్లు సమకూరతాయని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది.
దేశంలో అమెజాన్ (Amazon)డేటా సెంటర్ రీజియన్లు రెండు ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉండగా.. మరొకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీస్ ఏసియా పసిఫిక్ (ముంబై) రీజియన్‌ను 2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెజాన్ వెబ్ సర్వీస్ (Amazon Web Service) ఏసియా పసిఫిక్ హైదరాబాద్ రీజియన్‌ను 2022లో ఓపెన్ చేశారు. మరింత పటిష్టమైన వర్క్ లోడ్ రన్ చేసేలా.. కస్టమర్లకు రెండు రీజియన్లు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందిస్తాయి.