మణిపూర్ ప్రజల బాధను నేను పంచుకుంటున్నాను. ఇది ఒక భయంకరమైన విషాదం. ఇది మణిపూర్ (Manipur) ప్రజలందరికీ, దేశ ప్రజలకు కూడా చాలా బాధాకరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. శిబిరాల వద్ద కనీస సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. శిబిరాల్లో ఉన్న ప్రజలకు ఆహారం(food), మందులు తగినంత సరఫరా చేయాలని, క్యాంపుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మనకు శాంతి అవసరమని మణిపూర్‌లోని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు. హింస వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం ఉండదన్నారు. అల్లర్లు (Riots) ఒక భయంకరమైన విషాదమని, మనం ఇక్కడ శాంతిని నెలకొల్పాలని సూచించారు.