»The Prime Minister Visited The New Parliament Building
PM MODI : నూతన పార్లమెంటు భవనాన్ని సందర్శించిన ప్రధాని
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటును(Parliament) నిర్మిస్తున్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటును(Parliament) నిర్మిస్తున్నారు. రూ. 20 వేల కోట్ల సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టులో పార్లమెంటు కూడా ఒక భాగం. కొత్త పార్లమెంటుకు సంబంధించి ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ(Library) భోజన ప్రాంతాలు, వివిధ కమిటీ గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలం ఉంటాయి. కొత్త పార్లమెంటును(New Parliament) ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి కాదు. 2021 సెప్టెంబర్ లో కూడా ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.