భద్రతా వైఫల్యం కారణంగా కొందరు దుండగులు పార్లమెంట్‌లోకి వెళ్లి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల కుటుంబాలు స్పందిస్తూ.. ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Parliament: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కారణంగా దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా గుర్తించిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. నిజంగానే మా పిల్లలు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించండి. మా పిల్లలు చేసిన పనికి మేం సిగ్గు పడుతున్నాం. కానీ ఈ కుట్ర వెనుక పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు దాగి ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
నిందుతుడైన సాగర్‌ను ఎవరో కావాలనే కుట్రలోకి లాగారని అతని మేనమామ అన్నారు. పెద్ద వ్యక్తులే ఇందులో ఇరికించారు. వాళ్లు తప్పించుకుని.. మా పిల్లలను ఇరికించారని తెలిపారు. సాగర్ బయట తిరిగే వ్యక్తి కాదు. రాష్ట్రాలు తిరగడానికి అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అతను అడిగారు. మరో నిందితుడైన మనోరంజన్‌కు అసలు నేర నేపథ్యం లేదు. కేవలం భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‌తో మాత్రం సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరో నిందితుడైన అమోల్ శిందే సైనిక నియామకాలకు ట్రై చేస్తున్నాడు. అందులో సెలక్ట్ కాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే సైనిక శిక్షణ కోసం నెలకు రూ.4000 అడిగాడు. కానీ లేవని చెప్పగానే ఇంటి నుంచి వెళ్లిపోయాడని అమోల్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లలిత్ కోల్‌కతాలోని ఓ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. అక్కడ పోలీసులు అతని ఇంటి యజమానిని విచారించగా.. ఎవరితో అంతగా పరిచయం పెంచుకోలేదు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. సమయానికి ఇంటి అద్దె కూడా కట్టేవాడు కాదని తెలిపారు. లలిత్ పశ్చిమ బెంగాల్‌లోని ఎన్జీవోలో పనిచేశాడని విచారణలో తేలింది.