»Supreme Court Conduct Of Elections Should Be Sacred
Supreme Court: ఎన్నికల నిర్వహణ పవిత్రంగా జరగాలి
ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. వీటికి సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈక్రమంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో పవిత్రంగా జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court: Conduct of elections should be sacred
Supreme Court: ఎన్నికల ప్రక్రియ ఎంతో పవిత్రంగా జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. వీటికి సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్పై వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ఎంతో పవిత్రతో పాటు నిబద్ధతో కొనసాగాలి. అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనలకు గురి కాకుండా చూసుకోవాలని ధర్మాసనం తెలిపింది.
పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. అయితే ప్రక్రియను ఎన్నికల సంఘం న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం ఎన్ని వీవీప్యాట్ మెషీన్లు ఉన్నాయని కోర్టు ప్రశ్నించింది. సుమారు 17 లక్షల వీవీప్యాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎంకు సమానంగా వీవీప్యాట్ మెషీన్లు లేవా అని సుప్రీం ప్రశ్నించింది.