Supreme Court : బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాల కేసులు పెరిగిపోతున్నాయని, సంబంధిత చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదంటూ పిటిషన్లో ఆరోపణలు చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన పిటిషనర్ సొసైటీ ఫర్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తరఫు న్యాయవాది వాదనలను విని, తీర్పును రిజర్వ్ చేసింది.
దేశంలో బాల్య వివాహాల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్రం పేర్కొంది. బాల్య వివాహాల నిషేధ చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను గతంలో కోర్టు ఆదేశించింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అవగాహన కల్పించే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు, ఉపన్యాసాలు గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడం లేదని పేర్కొంది.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఒక అంశమని, అయితే సామాజిక స్థాయిలో ఏమి చేయవచ్చు అని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నిర్వహించిన కొన్ని కార్యక్రమాలను ఏఎస్జీ ఐశ్వర్య భాటి ప్రస్తావించారు. అసోంలో బాల్య వివాహాలను సామాజిక నేరంగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాల ఆరోపణలపై రాష్ట్రంలో అనేక మంది అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ అరెస్ట్‌లో ఏ సెక్షన్‌ను తప్పించడం లేదు. బాల్య వివాహాలు చేసే పూజారి నుంచి ఖాజీ వరకు అందరిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో బాల్య వివాహాలను అంతం చేయాలని చాలా కాలంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది సామాజిక నేరమని, బాల్య వివాహాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనర్ వయసులో పెళ్లి చేసుకుంటే వారిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.