సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఉడకబెట్టిన గుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. 12 మంది విద్యార్థులు గుడ్లు తినగానే మొత్తం కడుపులో తిప్పి మొత్తం బయటికి కక్కారు. ఆ తర్వాత కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడటంతో వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది.
ఈవిషయం తెలుసుకొని వెంటనే స్థానిక ఎమ్మెల్యే మురుగేశన్, అసిస్టెంట్ కలెక్టర్ అఫ్తాబ్ రసూల్ స్కూల్ కిచెన్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులు తిన్న గుడ్లను పరిశీలించి వాటిని ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతానికి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని.. వాళ్ల ఆరోగ్యం కుదుటపడిందని అధికారులు తెలిపారు.
Tamil Nadu | 12 students experienced stomach aches & vomiting allegedly after consuming eggs at a municipal primary school in Sivananthapuram, Paramakudi in Ramanathapuram. They were admitted to hospital.MLA S Murugesan & Asst Collector Aftab Rasool inspected the school's kitchen pic.twitter.com/hPuIkVv3JV