»Sonia Gandhi Announces Her Innings To Conclude Bharat Jodo Yatra
sonia gandhi:రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై.. భారత్ జోడో యాత్ర తర్వాత రిటైర్మెంట్?
sonia gandhi:కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగియనుందని తెలిపారు. పదేళ్ల యూపీఏ (upa regime) ప్రభుత్వం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు. 2024 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి.. దేశానికి పరీక్ష లాంటివని అన్నారు. రాయ్ పూర్లో (raipur) జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నామని తెలిపారు.
sonia gandhi announces her innings to conclude bharat jodo yatra
sonia gandhi:కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగియనుందని తెలిపారు. పదేళ్ల యూపీఏ (upa regime) ప్రభుత్వం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు. 2024 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి.. దేశానికి పరీక్ష లాంటివని అన్నారు. రాయ్ పూర్లో (raipur) జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నామని తెలిపారు.
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ (modi), బీజేపీ దేశంలో ప్రతీ సంస్థను తమ జేబు సంస్థలా మార్చుకున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ విద్వేషం నింపుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. బీజేపీని (bjp) గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాము ఏమీ చేయాలనుకున్నామో ప్రజలకు స్పష్టం చేయాలని సోనియా గాంధీ (sonia gandhi) కోరారు.
చదవండి:Mallikarjun Kharge: బీజేపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధం
గౌతమ్ అదానీకి (gautham adani) మేలు చేయడంపై సోనియా గాంధీ (sonia gandhi) ప్రస్తావించారు. మోడీ (modi) దోస్త్ అయినందునే అదానీ (adani) కంపెనీలకు రాయితీలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ (congress) అనేది ఒక పార్టీ కాదు.. దేశంలో గల అన్ని కుల, మత, వర్గాల గొంతుక అని తెలిపారు. వారందరీ కలలను నెరవేర్చే బాధ్యత పార్టీపై ఉందన్నారు. రాజ్యాంగ విలువలను బీజేపీ దిగదారుస్తోందని సోనియా మండిపడ్డారు.
If we look at the last 25 years, our victories in 2004 & 2009 elections along with the able leadership of Dr. Manmohan Singh ji gave me personal satisfaction. What gratifies me the most is that my innings could conclude with the historic Bharat Jodo Yatra.
సోనియా గాంధీ (sonia gandhi) 1998లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే నాటికి మధ్యప్రదేశ్ (madhya pradesh), ఒడిశా (odisha), మిజోరాంలో (mizoram) మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా అలాంటి సిచుయేషన్ ఉంది. రాజస్థాన్ (rajasthan), ఛత్తీస్ గడ్‌లో (chhattisgarh) మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. ‘మేం త్యాగాలు చేసేందుకు సిద్దం, అన్నీ పార్టీలు కలిసి ఎదుర్కొంటాం, బీజేపీని ఓడిస్తాం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (kharge) అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని అనుకుంటోందని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశం ఐకమత్యంగా ఉండేందుకు పాటుపడుతుందన్నారు. రాహుల్ గాంధీ (rahul gandhi) భారత్ జోడో యాత్ర చేపట్టడాన్ని ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీని 22 ఏళ్లు నడిపిన సోనియా గాంధీకి (sonia gandhi) కృతజ్ఞతలు తెలియజేశారు.