NLG: గుర్రంపోడు మండలం శాంతినగర్లో రూ.511.30 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో సుల్తాన్పూర్, ఎలమోనిగూడెం, తేనేపల్లి గ్రామాల ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 135/4 కి.మీ మేర ఈ రహదారి విస్తరించనుంది.