»Pilots Should Not Use Mouthwash Dgca New Regulations
DGCA : పైలట్లు మౌత్‌వాష్ వాడొద్దు..డీజీసీఏ కొత్త నిబంధనలు
విమానం నడిపే పైలట్లు, క్రూ సిబ్బంది మౌత్‌వాష్‌లు, టూత్ జెల్ లేదా ఆల్క్‌హాల్ శాతం అధికంగా ఉండే ఉత్పత్తులను వినియోగించొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు వెలువరించింది.
పైలట్లు (Pilots), విమాన సిబ్బంది ఇక నుంచీ మౌత్‌వాష్, టూత్ జెల్లను వాడకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది.తరచూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షల (Breathalyzer test) నేపథ్యంలో మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, విమాన సిబ్బంది ఆల్క్‌హాల్ (Alcohol) వినియోగం విషయంలో వైద్య పరీక్షల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను డీజీసీఏ (DGCA) విడుదల చేసింది.
ఒకవేళ ఎవరైనా వాటిని వైద్యుల సూచన మేరకు వాడుతుంటే విధుల్లోకి వెళ్లేముందు తాము పని చేసే సంస్థల వైద్యులను సంప్రదించాలి’ అని డీజీసీఏ వెల్లడించింది. అయితే అందులో పెర్ఫ్యూమ్ (Perfume) అనే పదాన్ని వాడలేదు.‘విమానాశ్రయానికి చేరిన తర్వాత ఎవరైనా సిబ్బంది/ ట్రెయినీ పైలట్ అనారోగ్యం కారణంగా తన ఫ్లయింగ్ విధులను సురక్షితంగా నిర్వర్తించలేకపోతున్నారని భావిస్తే, సిబ్బంది తమ యాజమాన్యానికి తెలియజేస్తారు.. అలాంటి సందర్భంలో బ్రీత్-ఎనలైజర్ పరీక్ష నిర్వహించరాదు’ అని పెర్కోన్నారు. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థలన్నీ బ్రీత్ ఎనలైజింగ్‌ను తప్పనిసరి చేశాయి. విమాన సర్వీసుల్లో (Air services) పాల్గొనే పైలట్లు, సిబ్బందికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆల్కహాల్ టెస్టు చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో మాత్రమే కొన్ని రోజులు మాత్రం ఈ తరహా పరీక్షలను నిలిపివేశారు.