ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మరో సారి హత్యా బెదిరింపు మెసేజ్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ ‘112’కు ముఖ్యమంత్రిని హత్య చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చిన మెసేజ్ లో ‘త్వరలోనే సీఎం యోగిని చంపేస్తా’ అని పేర్కొన్నట్లు పోలీసులు(Police) వెల్లడించారు.
ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేస...
తాను తీసుకునే ఫుడ్ వంటకాల గురించి రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఫుడ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రాహుల్(Rahul Gandhi) కీలక అంశాన్ని వెల్లడించారు. దేశంలోని రాజకీయ నాయకులలో 'ఉత్తమ చెఫ్' ఉన్నారని ప్రస్తావించారు. అతను ఎవరో కాదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అత్యుత్తమ ఆహారాన్ని తయారు చేస్తారని వెల్లడించారు.
సర్కస్ తో శంకరన్ జాతీయ, అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రాష్ట్రపతులు రాధాకృష్ణన్, ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీతోపాటు వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రపంచ నాయకులతో శంకరన్ సత్సంబంధాలు కొనసాగించారు. వారంతా శంకరన్ కు మంచి మిత్రులు.
సాంగ్లీలోని జాట్ నగరంలో చాంద్‌సాబ్ చివంగి అనే వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు.
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.
'మోదీ ఇంటిపేరు'తో దూషించారనే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తాత్కాలిక ఉపశమనం లభించింది. పాట్నా ప్రత్యేక కోర్టు(Patna Special Court)లో విచారణను నిలిపివేశారు. రాహుల్ మంగళవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పాట్నా హైకోర్టు(Patna High court) పేర్కొంది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్‌లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మ...