»Indias First Water Metro Pm Modi Will Inaugurate Tomorrow Know The Special Features Of This Train
Kochi Water Metro : తొలి వాటర్ మెట్రోను రేపు ప్రారంభించనున్న మోదీ.. దాని ప్రత్యేకతలు
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.
Kochi Water Metro : భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి. రూ. 1,137 కోట్ల ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్(KfW Development Bank) మరియు కేరళ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నాయి. వాటర్ మెట్రోలో ప్రయాణం చౌకైనది. ఇది కేరళను సందర్శించే పర్యాటకులకు చాలా ఉపశమనం కలిగిస్తుంద. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Vijayan) మాట్లాడుతూ, వాటర్ మెట్రో రవాణా కూడా పర్యావరణ అనుకూలమైనది ఉంటుందన్నారు. కొచ్చిలో నడుస్తున్న ఈ మెట్రో ఛార్జీ(Metro Charge) రూ. 20 నుండి రూ. 40 వరకు ఉంటుంది. దీనిని ఆన్ లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(kochin Shipyard Ltd) ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లను తయారు చేసింది. లిథియం టైటానేట్ స్పైనల్ బ్యాటరీలతో వికలాంగులకు సైతం సాఫీ ప్రయాణాన్ని అందించేలా ఈ బోట్లను తీర్చిదిద్దింది. అలల ప్రవాహం వ్యతిరేకంగా ఉన్నా ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీటిని డిజైన్(Design) చేసింది. కొచ్చి వాటర్ మెట్రో (KWM) బోట్లు దాని తొలుత 38 టెర్మినల్స్(స్టాప్)ను కవర్ చేస్తాయి. ఇవి హైకోర్టు-వైపిన్ టెర్మినల్స్ నుండి వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ వరకు నడుస్తాయి. హైకోర్టు టెర్మినల్ నుంచి వైపిన్ టెర్మినల్(Terminal)కు ప్రయాణికులు 20 నిమిషాల్లోపే చేరుకుంటారని ముఖ్యమంత్రి విజయన్(CM Vijayan) తెలిపారు. వాటర్ మెట్రో ద్వారా వైట్టిల నుంచి కక్కనాడ్ వరకు కూడా 25 నిమిషాల్లో చేరుకోవచ్చు.
కొచ్చి వన్ కార్డ్
కొచ్చి మెట్రో రైలు, కొచ్చి వాటర్ మెట్రో రెండింటిలోనూ కొచ్చి వన్ కార్డు కొని ప్రయాణించవచ్చు. ఇందులో మూడు రకాల ప్రత్యేక పాస్(Special Pass)లు ఉంటాయి. రూ. 180 పాసుతో 12 ట్రిప్పులు తిరగవచ్చు. రెండవది ప్రత్యేక నెలవారీ పాస్.. రూ. 600 అవుతుంది. ఇది 50 ట్రిప్పుల వరకు వర్తిస్తుంది. మూడవది మూడు నెలలకు ప్రత్యేక పాస్ ఉంటుంది. దీని ధర రూ. 1500 మరియు 150 ట్రిప్పు(Trip)లను అనుమతిస్తుంది. అన్ని పడవల్లో ఒకేసారి 100 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగేలా 50 సీట్లు ఉంటాయి. ఒక పడవలో 21 భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. 110 లైఫ్ జాకెట్లు(Life Jockets) కూడా ఉన్నాయి. పూర్తి ఏసీ బోట్ మోడల్ మెట్రో రైలు(Metro Train)లా ఉంటుంది. ఈ మెట్రో తయారీ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగింది.
కేరళలో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మంగళవారం కేరళ రాష్ట్ర తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను ప్రధాని ప్రారంభించనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుండి కాసర్గోడ్ వరకు నడుస్తుంది. ఈ ప్రారంభోత్సవంతో పాటు రూ.3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. కేరళ వందే భారత్ రైలు తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ మరియు కాసరగోడ్ సహా 11 జిల్లాలను కవర్ చేస్తుంది. 586 కి.మీ పొడవున్న ఈ రైలుకు చైర్ కార్(Chair car)కు రూ.435 నుంచి రూ.1,590 వరకు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాస్‌లకు రూ.820 నుంచి రూ.2,880 వరకు ఉంటుంది. వందే భారత్ త్రివేండ్రం(Trivendram) సెంట్రల్ నుండి కాసరగోడ్ వరకు 8 గంటల 5 నిమిషాలలో ప్రయాణాన్ని కవర్ చేస్తుంది, అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్ అదే దూరాన్ని చేరుకోవడానికి సుమారు 8 గంటల 59 నిమిషాలు పడుతుంది. తిరువనంతపురం, కోజికోడ్, వర్కల శివగిరి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్‌కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.