»Mahua Moitra Warriors Are Back Twitter Post Opposition Women Mp 18th Lok Sabha Session Begins
Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’ మహిళా ఎంపీల ఫోటో వైరల్
నగదు బహుమతికి బదులుగా లోక్ సభలో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై 17వ లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు.
Mahua Moitra: నగదు బహుమతికి బదులుగా లోక్ సభలో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై 17వ లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మహువా మొయిత్రా రెండోసారి విజయం సాధించారు. 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మహువా మొయిత్రా పార్లమెంటుకు చేరుకుని మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దానికి వారియర్స్ ఆర్ బ్యాక్ అంటు క్యాప్షన్ ఇచ్చారు.
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని మోడీ, ఇతర క్యాబినెట్ మంత్రులు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహువా మొయిత్రా రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఒకటి 2019లో ఆమె తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనప్పుడు, మరొక చిత్రం 18వ లోక్‌సభ తొలి రోజు సోమవారం నాటిది. 2019 నాటి పాత ఫోటోలో ఎంపీలు మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జోతిమణి, తమిజాచి తంగపాండియన్ పార్లమెంటు లోక్ సభలో బెంచ్‌పై కూర్చున్నట్లు చూపుతుండగా, తాజా ఫోటో కొత్త లోక్‌సభ ఎంపీ డింపుల్ యాదవ్‌ను చూపుతోంది.
మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతర ఎంపీలు – సుప్రియా సూలే, జోతిమణి, తమిజాచి తంగపాండియన్, డింపుల్ యాదవ్ వరుసగా మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం, తమిళనాడులోని కరూర్ స్థానం, చెన్నై సౌత్ స్థానం, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 18వ లోక్‌సభలో మొత్తం 74 మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది 2019లో ఎన్నికైన 78 మంది కంటే కొంచెం తక్కువ. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో మహువా మొయిత్రా సభ్యత్వం తిరస్కరణకు గురైంది. లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ మళ్లీ కృష్ణానగర్ నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని ఓడించి మళ్లీ పార్లమెంట్‌కు చేరుకున్నారు.