ఇండియన్ రైల్వే(Indian Railway) కొత్త నిబంధనల(New Rules)ను ప్రకటించింది. ఇకపై రైళ్లలో ప్రయాణించేవారు ఈ రూల్స్ పాటించాల్సిందే. లేకుంటే రైల్వే జరిమానా విధించనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారంగా రాత్రి సమయాల్లో ప్రయాణికులకు ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ను తెచ్చింది. రైలు అటెండర్లు, టీటీఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర రైల్వే ఉద్యోగులకు కూడా ఈ రూల్స్ వర్తించనున్నాయి. ధూమపానం, మద్యం సేవించి ప్రయాణించే వారికి ఐఆర్సీటీసీ నుంచి తీవ్రమైన జరిమానాలను రైల్వే విధించనుంది.
ఐఆర్సీటీసీ(IRCTC) కొత్త రూల్స్(New Rules) ప్రకారం..ప్రయాణికులు తమ సీట్లు, కంపార్టుమెంట్లు లేదా కోచ్‌లల్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఇతరులు ఫోన్ మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు. రైలు ప్రయాణికులు(Railway Passengers) హెడ్ ఫోన్స్ లేకుండా పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినకూడదు. రాత్రి 10 గంటలకు తర్వాత లైట్లు వేయకూడదని రైల్వే వెల్లడించింది.
రాత్రి 10 గంటల తర్వాత టికెట్ కలెక్టర్(TC) ప్రయాణికులను టిక్కెట్లు చూపించమని అడగకూడదు. సమూహంగా ప్రయాణించేవారు రాత్రి 10 తర్వాత ఎటువంట అరుపులు, శబ్దాలు చేయకూడదు. మిడిల్ బెర్త్ ప్రయాణికులు ఎప్పుడైనా తమ సీట్లు తెరుచుకునే అవకాశం ఉంటుంది. లోయర్ బెర్త్ వారు వారిపట్ల ఎటువంటి ఫిర్యాదులు చేయకూడదు. ఆన్ లైన్ డైనింగ్ సేవలు రాత్రి 10 తర్వాత ఉండవు. ఈ-కేటరింగ్ సేవల ద్వారా భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకునే అనుమతి ఉంటుందని రైల్వే(Railway) ప్రకటించింది.
ఇకపోతే ఏసీ కోచ్‌ల(AC Coaches)ల్లో ప్రయాణించేవారు ఒక్కొక్కరూ 70 కిలోల వరకూ సరుకులు తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకూ బ్యాగేజీ ఉచితం తీసుకెళ్లవచ్చు. అదనపు బ్యాగేజీ ఛార్జీలతో ప్రయాణికులు 150 కిలోల లగేజీని, స్లీపర్ లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ లో 70 కిలోలు తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని రైల్వే(Railway) వెల్లడించింది.