»Chhattisgarh Woman Throws Acid At Ex Boyfriend During His Wedding Held
Woman throws acid: వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి..!
ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల 19న రాత్రి వేళ భన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో 25 ఏళ్ల దామ్రుధర్ బాఘేల్‌కు 19 ఏళ్ల యువతితో పెళ్లి(marriage) జరుగుతోంది. ఇంతలో పెళ్లి వేదిక ప్రాంతంలో కరెంట్ పోయింది. ఆ వెంటనే వరుడు దామ్రుధర్ బాఘేల్‌పై యాసిడ్ దాడి((acid attack) జరిగింది. దీంతో అతడితోపాటు వధువు, పెళ్లి మండపం వద్ద ఉన్న మరో పది మందికి స్వల్పంగా గాయపడ్డారు.
కరెంట్ లేకపోవడంతో యాసిడ్ పోసిన వ్యక్తి ఎవరన్నది అక్కడున్న వారు గుర్తించలేకపోయారు. కాగా, వధువు దామ్రుధర్ బాఘేల్‌పై యాసిడ్ దాడి గురించి పోలీసులకు(police) ఫిర్యాదు అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కరెంట్ లేకపోవడంతో యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని ఎవరూ గుర్తించలేదన్న సంగతి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.
వధువరులకు ఎవరితోనైనా ప్రేమ వ్యవహారం ఉన్నదా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. దీంతో వరుడు(bride) దామ్రుధర్ బాఘేల్ ప్రియురాలి గురించి పోలీసులకు తెలిసింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తానే యాసిడ్‌తో దాడి చేసినట్లు అతడి ప్రియురాలు ఒప్పుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు మోసగించడంతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులకు చెప్పింది. తాను పని చేసే పొలంలో డ్రిప్ ఇరిగేషన్‌ను క్లీన్ చేసేందుకు వినియోగించే యాసిడ్‌ను దొంగిలించినట్లు తెలిపింది.
అలాగే తనను గుర్తించకుండా ఉండేందుకు మగవాడిగా డ్రెస్ ధరించి అక్కడకు వచ్చి యాసిడ్ తో దాడి చేశానని అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(police) తెలిపారు.