»Teenmar Mallanna Team State Convenor Retired Ci Dasari Bhumaiah Arrested In Realtor Murder Attempt Case
Teenmar Mallannaకు భారీ షాక్.. హత్య కుట్ర కేసులో మాజీ సీఐ అరెస్ట్
తీన్మార్ మల్లన్న టీమ్ లో రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన మాజీ సీఐ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తో తీన్మార్ మల్లన్న టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన టీమ్ లోని ప్రధాన వ్యక్తి అరెస్ట్ కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ లో కలకలం రేపింది.
ఒక నాటి జర్నలిస్ట్ (Journalist).. క్యూ న్యూస్ (Q News) పేరిట యూట్యూబ్ చానల్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna). రాజకీయాల్లోకి వచ్చినా అపరిపక్వ నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ ను తిట్టుడు తప్ప ఇంకే పని లేదు. అలాంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇటీవల కొత్త పార్టీ పెట్టాడు. కానీ అంతకుముందు తీన్మార్ మల్లన్న టీమ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ టీమ్ లో రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన మాజీ సీఐ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తో తీన్మార్ మల్లన్న టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన టీమ్ లోని ప్రధాన వ్యక్తి అరెస్ట్ కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ లో కలకలం రేపింది. దీని వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ (Karim Nagar) చెందిన చెందిన దాసరి భూమయ్య (62) (Dasari Bhumaiah) మాజీ సీఐ. తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కన్వీనర్ (State Convenor)గా ఉన్నాడు. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు నక్సలైట్ల ఏరివేతకు రంగారెడ్డి జిల్లాకు (RangaReddy District) చెందిన విజయపాల్ రెడ్డిని (Vijaypal Reddy) ఇన్ ఫార్మర్ గా ఉపయోగించుకున్నాడు. తన పలుకుబడితో విజయ్ పాల్ ను కానిస్టేబుల్ గా చేయించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి అక్రమాలు చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించాడు. బినామీగా విజయ్ పాల్ రెడ్డి మారాడు. 2018లో ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐగా ఉన్న సమయంలో భూమయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం స్థిరాస్తి వ్యాపారం విషయంలో భూమయ్య, విజయపాల్ కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే విజయపాల్ ను చంపేందుకు (Murder Attempt) మాజీ సీఐ కుట్ర పన్నాడు. దీనికి పెద్దపల్లికి చెందిన జనశక్తి (Janashakti) ప్రతిఘటన గ్రూపులో పని చేసిన చంద్రయ్య అలియాస్ చందు యాదవ్ (47) సహాయం కోరాడు. శంకర్ (కాజీపేట), గడ్డం కుమార్ (పెద్దపల్లి జిల్లా జూలపల్లి)తో కలిసి విజయపాల్ హత్యకు ప్రణాళిక రచించారు. హత్యకు రూ.20 లక్షలు సుపారీ తీసుకున్నారు. హత్య ప్రణాళిక అమలు చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ (Secunderabad)లోని ఓ హోటల్ లో వీరు మకాం వేశారు. హత్యకు కుట్ర పన్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై దాడి చేశారు. చందు, కుమార్, శంకర్ ను అరెస్ట్ చేశారు. మాజీ సీఐ భూమయ్యను కరీంనగర్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక పిస్తోల్, రెండు కత్తులు, రూ.లక్ష నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రివార్డులు ప్రకటించి అభినందించారు.
Acting on a tip-off, taskforce teams averted a murder of a realtor.
An ex-cop who bore a grudge against his business partner colluded with the former naxalite and a business man. Three hired killers had been tracking the realtor and did a recee.