»Wife Did Not Come To Home The Husband Climbed The Tower And Protested
Viral : పెళ్లాం రావట్లేదని స్టేషన్ ఎదుట భర్త చేసిన పనికి పోలీసులే షాక్
సాంగ్లీలోని జాట్ నగరంలో చాంద్సాబ్ చివంగి అనే వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు.
Viral : భార్య భర్తల మధ్య గొడవలు చాలా సాధారణం. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారు న్యాయస్థానాల(Court)ను ఆశ్రయిస్తారు. దంపతులకు సర్ది చెప్పి కలిపేందుకు పోలీసులు, బంధువులు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావు. అలాంటి సందర్భంలోనే భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో భర్త తట్టుకోలేక సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఆ వ్యక్తి సాక్షాత్తు స్టేషన్(Station) సమీపంలోని టవర్ ఎక్కడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ వ్యక్తి అత్తామామల వద్దకు పరుగుతీశారు.
వివరాల్లోకి వెళితే.. సాంగ్లీ(Sangli)లోని జాట్ నగరంలో చాంద్సాబ్ చివంగి అనే వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు(Police) పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం షాక్ తింది. చాంద్సాబ్ కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా ఇండికి చెందినవాడు. జాట్ తాలూకాలోని గిర్గావ్(Girigav)కు చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా అతని భార్య వెళ్లిపోయింది. ఎన్నిసార్లు అత్తమామలను భార్యను పంపించమని కోరినా పంపకపోవడంతో చాంద్సాబ్(Chand sab) కూడా జాట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. వారు నిర్లక్ష్యం వహించడంతో ఎట్టకేలకు ఈరోజు ఉదయం నేరుగా జాట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న మొబైల్ టవర్ ఎక్కి షోలే(Shole) తరహాలో నిరసన చేపట్టారు. చాంద్ సాబ్ సుమారు గంటపాటు మొబైల్ టవర్‌పై కూర్చొని ఉండటంతో పోలీసు యంత్రాంగం అతని భార్యతో మాట్లాడి హామీ ఇచ్చారు. రాజీకి వస్తామని భార్య వాళ్లు హామీ ఇవ్వడంతో చాంద్సాబ్ దిగిపోయాడు. గంటపాటు సాగిన గందరగోళం ఆగిపోయింది. ఈ నిరసన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.