Supreme court closed case telangana government filed pending bills
Supreme court:తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని సర్కార్ సుప్రీంకోర్టులో (Supreme court) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో గల ధర్మాసనం ఈ రోజు కేసును విచారించింది. గవర్నర్ (governenr) తరఫున సొలిసిటర్ జనరల్.. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయి.
గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లుల పైన నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్లు నడుచుకోవాలని సూచించింది. తమ వద్ద ఏ బిల్లులు కూడా పెండింగులో లేవని గవర్నర్ తరఫు లాయర్ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు బిల్లులకు సంబంధించి మాత్రమే తాము ప్రభుత్వ వివరణ కోరినట్లు కోర్టుకు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాల పైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు లాయర్ సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బిల్లులను తిప్పి పంపించాలంటే వీలైనంత వెంటనే పంపించవచ్చునని, పెండింగ్లో పెట్టడం సరికాదని కోర్టుకు విన్నవించుకున్నారు.
గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్లో (pending) పెట్టారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme court) పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన గవర్నర్ కార్యాలయం (governer office) నుంచి కోర్టుకు నివేదిక అందింది. దానిని సీజేఐ రికార్డ్ చేశారు.3 బిల్లులకు ఆమోదం తెలిపారని.. కొన్ని బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారని తెలిపారు. ఆ విషయం గవర్నర్ కార్యాలయం నివేదికలో పేర్కొందని చెప్పారు. పెండింగ్ బిల్లుల విషయంపై విచారణను వాయిదా వేసింది. ఈ రోజు విచారణ జరగగా.. ప్రస్తుతం బిల్లులు ఏమీ పెండింగ్లో లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేసును క్లోజ్ చేస్తున్నామని సుప్రీంకోర్టు (Supreme court) ధర్మాసనం స్పష్టంచేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr), గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్ మధ్య పడటం లేదు. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే విషయంలో ఏర్పడిన విభేదాలు కొనసాగుతున్నాయి. తమిళి సై.. భద్రాద్రి వెళ్లినా.. యాదాద్రి వెళ్లినా.. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీనిపై తమిళి సై బహిరంగంగానే విమర్శలు చేశారు. చాలా సందర్భాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారని వార్తలు వచ్చాయి.