ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్(Twitter)లో ఎప్పటికప్పుడు పోస్ట్లు చేస్తుంటారు. అవి ఎక్కువగా అప్పటి సంఘటనలు అవ్వొచ్చు.. పాతకాలం నాటివి కావొచ్చు.. తనకు నచ్చిన వీడియోను రీట్వీట్ చేయడం లేదా పోస్ట్ చేయడం చాలా చూసే ఉంటాం. ఆయన ద్వారా సమాజానికి తెలిసిన విషయాలు వందల్లో ఉంటాయి.ఆనంద్ మహీంద్రా షేర్ చేశారంటే.. తప్పకుండా ఏదో ఒక విశేషం లేదా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఫుట్ బాల్ (Football)స్టేడియానికి కూడా ప్రత్యేకత ఉందండి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తున ఈ స్టేడియం కొలువుదీరింది. దేశంలోనే ఎత్తయిన ఫుట్ బాల్ స్టేడియం ఇది.
ప్రపంచంలో చూస్తే ఎత్తయిన ఫుట్ బాల్ మైదానాల్లో పదో స్థానంలో ఉంది. ‘‘ఈ దృశ్యం మీ ఊపిరిని దూరం చేస్తుంది. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల కాదు. కూర్చుని పొటాటో చిప్స్ తింటూ క్రికెట్ (Cricket) చూడడానికి బదులు భవిష్యత్తులో ఏదో ఒక ఆదివారం ఈ స్టేడియంలో నేను మ్యాచ్ ను వీక్షించాలని అనుకుంటున్నాను’’ అని ఆనంద్ మహీంద్రా కోట్ చేశారు. ఇప్పటికే మూడు లక్షల మంది దీన్ని చూసేశారు. ఐపీఎల్(IPL) సీజన్ 2023 మంచి రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు గట్టి పోటీనిస్తోంది. దీంతో అభిమానులకు చివరి ఓవర్ దాకా ఉత్కంఠ తప్పడం లేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నెలకొంటే.. మరోవైపు లఢఖ్ (Ladakh) లో ఓ ఫుట్ బాల్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫుట్ బాల్ స్టేడియం(Football stadium) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. ఆయన దీన్ని ఎంతగానో మెచ్చుకుంటూ, ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో(Twitter account) షేర్ చేశారు.
That view takes your breath away. And not because of oxygen depletion!! At some point in the future I want to be physically present at a Football match in that stadium on a Sunday, Instead of being a couch potato and watching cricket on TV! https://t.co/BxJoehTKjW