VZM: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ఆదివారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పండిట్ దీన్ దయాల్ ప్రశిక్షణ కార్యక్రమం రెండో రోజు జరిగింది. కార్యకర్తలు ఏడు ప్రాధాన్యత అంశాలపై అవగాహన పెంపొందించుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. 7 అంశాలపై సమగ్రంగా వివరించారు.